క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై 181 దరఖాస్తులకు సూపర్‌చెక్
అనంతపురం బ్యూరో
క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై 181 దరఖాస్తులకు సూపర్‌చెక్
అనంతపురం కలెక్టరేట్‌లో ఎస్ఐఆర్–2026లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.సి. కిషోర్ కుమార్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఓ. ఆనంద్‌తో కలిసి సూపర్‌చెక్ నిర్వహించారు.
జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ లాగిన్‌లో వచ్చిన 181 క్లెయిమ్‌లను పరిశీలించారు. వీటిలో 97 చేర్పులు, 75 మార్పులు, 9 తొలగింపులకు సంబంధించినవి ఉన్నాయి. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు నిబంధనల ప్రకారం ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
బల్క్‌గా ఫారం–6, 7, 8 దరఖాస్తులు రాకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయడంతో పాటు అనర్హులకు ఓటరు జాబితాలో స్థానం కల్పించరాదని ఆదేశించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై అవసరమైన పత్రాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లాలో సమర్థంగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్‌ను అభినందించారు.