BREAKING
రాయదుర్గంలో ‘మన్ కీ బాత్’ వీక్షించిన కాపు రామచంద్రారెడ్డి నేపాల్‌లో ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్న నారాయణి నది రేపటి నుంచి మూడ్రోజులు బ్యాంకులు బంద్‌..! కూటమి ప్రభుత్వంపై బీఎస్పీ నేత నాగరాజు విమర్శలు మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై 181 దరఖాస్తులకు సూపర్‌చెక్ తక్షణమే డీఏల మంజూరు జీవో విడుదల చేయాలి. చిప్స్ నుంచి షిప్స్ వరకు స్వదేశీ పరిజ్ఞానమే లక్ష్యం అందరిని అలరించేలా జూనియర్ టోర్నమెంట్ నిర్వహిస్తాం: కడప జిల్లా సాప్ట్ బాల్ సెక్రెటరీ రామసుబ్బారెడ్డి అడవులకు మళ్లీ ఏనుగులు చేరాయి.. మన్ కీ బాత్‌లో అసోం పరిరక్షణ ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ తటస్థ విధానాన్ని మరింత కఠినతరం చేయడంపై స్విట్జర్లాండ్‌లో ఓటింగ్ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం బ్రిటన్‌లోని యూఎస్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్ వద్ద భద్రత భారీగా పెంపు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. రాజకీయ లబ్ది కోసం నా వాఖ్యలను వక్రీకరించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి  ప్రొద్దుటూరు క్రైం, మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు ఔట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ తెలిపారు. ఆసుపత్రిలోని కంటి విభాగం ఎదురుగా సాయంత్రం సమయంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పడుకుని నిద్రించినట్లు, అనంతరం నిద్రలోనే మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు చెప్పారు. మృతుడి గురించి తెలిసిన వారు, కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీని సంప్రదించి మృతదేహాన్ని గుర్తించి, నిబంధనల ప్రకారం తీసుకెళ్లాలని ఔట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ కోరారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం కోసం 9154666607 ను సంప్రదించాలన్నారు.