BREAKING
రాయదుర్గంలో ‘మన్ కీ బాత్’ వీక్షించిన కాపు రామచంద్రారెడ్డి నేపాల్‌లో ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్న నారాయణి నది రేపటి నుంచి మూడ్రోజులు బ్యాంకులు బంద్‌..! కూటమి ప్రభుత్వంపై బీఎస్పీ నేత నాగరాజు విమర్శలు మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై 181 దరఖాస్తులకు సూపర్‌చెక్ తక్షణమే డీఏల మంజూరు జీవో విడుదల చేయాలి. చిప్స్ నుంచి షిప్స్ వరకు స్వదేశీ పరిజ్ఞానమే లక్ష్యం అందరిని అలరించేలా జూనియర్ టోర్నమెంట్ నిర్వహిస్తాం: కడప జిల్లా సాప్ట్ బాల్ సెక్రెటరీ రామసుబ్బారెడ్డి అడవులకు మళ్లీ ఏనుగులు చేరాయి.. మన్ కీ బాత్‌లో అసోం పరిరక్షణ ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ తటస్థ విధానాన్ని మరింత కఠినతరం చేయడంపై స్విట్జర్లాండ్‌లో ఓటింగ్ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం బ్రిటన్‌లోని యూఎస్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్ వద్ద భద్రత భారీగా పెంపు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. రాజకీయ లబ్ది కోసం నా వాఖ్యలను వక్రీకరించారు.

మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Select Suryaa Now
మున్సిపల్ కమిషనర్  తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలకు మెరుగైన  సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ను సంస్థ ప్రతినిధులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సంబంధిత ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్న విధానం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ ప్రోగ్రాం హర్షనియమని అన్నారు. కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆ లక్ష్యం నెరవేరడానికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకున్నానని అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సియర్ సహకారంతో రీల్స్ వైరల్ కావడంతో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సంకల్పం ప్రజల వద్దకు త్వరగా చేరిందని మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం, నిషేధిత ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం వంటి అంశాల్లో ప్రజల సహకారం, స్వచ్చంద సేవ సంస్థల సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు మరియు సంబంధిత ప్రభుత్వం శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించగలమని కమిషనర్ తెలిపారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత విధానాలను అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా, పట్టణంలో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని కమీషనర్ తెలిపారు. మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ వి మునిశేఖర్ రెడ్డి చైర్మన్ శ్రీమతి వి కళావతి గారు డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.