అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు ఘన స్వాగతం
అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు ఘన స్వాగతం
అనంతపురం బ్యూరో:
అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.సి. కిషోర్ కుమార్, ఐఏఎస్ ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఆర్డీటీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. పూలమొక్క అందజేసి ఘన స్వాగతం పలికారు. జిల్లాలో ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పర్యటనలో భాగంగా సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.