మేము చేసింది తప్పే క్షమించండి
- చేతులెత్తి నమస్కరించిన వైసిపి నాయకులు
దర్శి, మేజర్ న్యూస్ :
మేు చేసింది తప్పే క్షమించండి అంటూ ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు చేతులెత్తి నమస్కరించి కంచుమాటి నాగేశ్వరరావు టిడిపి నాయకులకు క్షమాపణలు చెప్పారు. ఉమామహేశ్వరపురం గ్రామంలో ఈనెల 21న టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని విగ్రహం శోభాయాత్రకు బయలుదేరింది. ఆ సందర్భంగా యువకులు గులాంచల్లుకున్నారు. గులాం చల్లుకునే నేపథ్యంలో కొంత రోడ్డుపై ఉన్నా వైఎస్ బొమ్మపై పడింది. మరుసటి రోజు అటుగా వస్తున్న గ్రామ నీటి సంఘం అధ్యక్షులు కంచుమాటి నాగేశ్వరరావు వైసీపీ నాయకులు ఆపి వైఎస్ బొమ్మపై గులాం పడింది దాన్ని కడగాలంటూ బెదిరిస్తూ హుకం జారీ చేశారు. నాగేశ్వరరావు నేను నీళ్ల పైపుతో వైఎస్ విగ్రహాన్ని కడుగుతుండగా ఆ సంఘటనలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నాగేశ్వరరావు తన మనోభావాలను దెబ్బ తీస్తూ అందరూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టిడిపి అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నాయకులు ఏమనుకున్నారో ఏమోగానీ గ్రామంలో గల వైఎస్ విగ్రహం వద్ద నిలబడి మేము చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి అంటూ నమస్కరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.