అభివృద్ధి పనులకు రూ.5.20 కోట్ల నిధులు మంజూరు
ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన ఎంపీ ఈటెల రాజేందర్ కు కృతజ్ఞతలు
మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 27):మేడ్చల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో హెచ్‌ఎండీఏ ద్వారా వివిధ రహదారి అభివృద్ధి పనులకు మొత్తం రూ.5.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు.ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం గ్రామం మీదుగా జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాల శ్రీరంగవరం వరకు బీటీ రోడ్డు విస్తరణ, పటిష్టత పనులకు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.అదేవిధంగా దేవరయాంజాల్ పరిధిలో మందాయిపల్లి రోడ్డు నుంచి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.20 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు.ఈ నిధులతో రహదారుల అభివృద్ధి పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆమె అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.రిపోర్టర్ తలారి శివకుమార్.