నాగిరెడ్డి పేటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు.
సూర్య, నాగిరెడ్డి పేట్,
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేట పద్మశాలి జనరల్ సెక్రెటరీ మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ... స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడారని కొనియాడారు..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట పద్మశాలి అధ్యక్షుడు వినోద్, పద్మశాలి సంఘ సభ్యులు విట్ఠల్, మహేష్, ప్రశాంత్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.