కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీ హీరో వరుణ్ తేజ్..
సూర్య మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో వరుణ్ తేజ్ ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన హీరో వరుణ్ తేజ్‌కు ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు.
గర్భాలయంలో స్వయంభూ అంజన్నను దర్శించుకున్న వరుణ్ తేజ్.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనా రెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ కుమార్, ఆలయ అర్చకులు చిరంజీవి, మారుతి తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు క్షేత్రానికి హీరో వరుణ్ తేజ్ రాకతో అక్కడ సందడి నెలకొంది.