తండ్రి ఆస్తిలో వివాహిత కూతురి హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
తండ్రి ఆస్తిలో వివాహిత కూతురి హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు గల చట్టపరమైన హక్కులపై స్పష్టమైన వివరాలు:
పూర్వీకుల ఆస్తి
* కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా పుట్టుకతోనే సమాన వాటా లభిస్తుంది.
* కూతురికి వివాహం అయినా కాకపోయినా ఈ హక్కు వర్తిస్తుంది.
* సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా వాటా క్లెయిమ్ చేసుకోవచ్చు.
స్వార్జిత ఆస్తి
* తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే, కొడుకులతో పాటు కూతురికీ సమాన వాటా దక్కుతుంది.
* ఒకవేళ తండ్రి జీవించి ఉన్నప్పుడు తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా రాసిస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు.