BREAKING
కొల్లాంలో మహిళా సాధికారత, సహకార రంగ కార్యక్రమాలను ప్రారంభించిన అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘం వివరణపై ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు త్వరలో తమిళనాడులో నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం పథకం.. ప్రారంభించనున్న టీవీకే అధినేత విజయ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీ హీరో వరుణ్ తేజ్.. విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు నాగిరెడ్డి పేటలో ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలు. అభివృద్ధి పనులకు రూ.5.20 కోట్ల నిధులు మంజూరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సరికొత్త సాంకేతిక లోపం ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాలని బీఎస్పీ డిమాండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ గౌడ కల్లు గీత కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు కల్పించాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు ఘన స్వాగతం ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

ఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మడకశిరలో కాంగ్రెస్ నిరసన

Select Suryaa Now
ఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మడకశిరలో కాంగ్రెస్ నిరసన

అనంతపురం బ్యూరో 

 

ఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మడకశిరలో కాంగ్రెస్ నిరసన

 

 

 భారత ఎన్నికల సంఘం తీసుకుంటున్న పలు నిర్ణయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడకశిరలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుడు ఎన్. రఘువీరా రెడ్డి నిరసనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం వైఖరికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను పునఃపరిశీలించి ప్రజాస్వామ్య విలువలు, ఓటర్ల హక్కులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.