మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం గ్రాండ్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే
భవిష్యత్ వైద్యులుగా ఎదుగుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలి
మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం – తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించిన “Grand Success Meet 2026” కార్యక్రమం ఆదివారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు.
“Together We Heal Tomorrow – Future Doctors Building a Healthier Tomorrow” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య విద్యలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను అభినందించారు. భవిష్యత్ వైద్యులుగా ఎదిగి సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల కృషి, ప్రోత్సాహం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
వైద్య రంగంలో తెలంగాణ విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా తమ వృత్తిలో నిబద్ధతతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో Parents Association of Medical Students – Telangana State ప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.