అనంతపురంలో ప్రతి ఆదివారం నిరంతరంగా గోసేవ కార్యక్రమం
అనంతపురం బ్యూరో
అనంతపురంలో ప్రతి ఆదివారం నిరంతరంగా గోసేవ కార్యక్రమం
అనంతపురం: పట్టణంలో ప్రతి ఆదివారం ఉదయం క్రమం తప్పకుండా గోసేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో, శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటల వరకు గోమాతకు సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది.
గోసేవలో ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. భక్తులు, దాతలు తమకు సాధ్యమైన సహాయ సహకారాలు అందిస్తూ ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన పి. సుధీర్ గారు గోసేవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కుటుంబానికి గోమాత, శ్రీనివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గోవిందా... గోవిందా... గోవిందా... అంటూ భక్తి శ్రద్ధలతో గోసేవ కార్యక్రమం కొనసాగుతోంది.