BREAKING
కొల్లాంలో మహిళా సాధికారత, సహకార రంగ కార్యక్రమాలను ప్రారంభించిన అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘం వివరణపై ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు త్వరలో తమిళనాడులో నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం పథకం.. ప్రారంభించనున్న టీవీకే అధినేత విజయ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీ హీరో వరుణ్ తేజ్.. విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు నాగిరెడ్డి పేటలో ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలు. అభివృద్ధి పనులకు రూ.5.20 కోట్ల నిధులు మంజూరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సరికొత్త సాంకేతిక లోపం ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాలని బీఎస్పీ డిమాండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ గౌడ కల్లు గీత కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు కల్పించాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు ఘన స్వాగతం ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

ఎడిఫై స్కూల్‌లో వైఆర్ఆర్ క్రికెట్ అరేనా ప్రారంభం

Select Suryaa Now
ఎడిఫై స్కూల్‌లో వైఆర్ఆర్ క్రికెట్ అరేనా ప్రారంభం

వైఆర్ఆర్ క్రికెట్ అరేనా ప్రారంభం

ముఖ్య అతిథిగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ డిప్యూటీ అంబాసిడర్ బుడిగి శ్రీనివాసరెడ్డి

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 27 (మజర్  న్యూస్):

ప్రొద్దుటూరు ఎడిఫై స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఆర్ఆర్ క్రికెట్ అరేనాను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మయన్మార్‌లో భారత రాయబార కార్యాలయానికి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ డిప్యూటీ అంబాసిడర్ బుడిగి శ్రీనివాసరెడ్డి హాజరై క్రికెట్ అరేనాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025లో ప్రొద్దుటూరులో ప్రారంభమైన ఎడిఫై స్కూల్ అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందడం అభినందనీయమన్నారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

తల్లి, మాతృభాష, మాతృభూమి మన ఉన్నతికి ప్రధాన కారణాలని, స్త్రీల నుంచి సృష్టిలో శక్తి ఉద్భవిస్తుందని అన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో ఆసక్తి, ఉత్సాహాన్ని కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు.

క్రీడలు విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సామాజిక బంధం పెంపొందిస్తాయని చెప్పారు. ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు అభివృద్ధి చెందుతుందని, అందుకు క్రీడలు సరైన మార్గమని వివరించారు. క్రమశిక్షణతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చన్నారు.

క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా అవకాశాలు లభిస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాయని తెలిపారు. తాను భారత రాయబారి స్థాయి అధికారిగా మయన్మార్ నుంచి ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన అనేక మంది జీవితాల్లో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు.

చదువు–క్రీడలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి

కడప డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎడిఫై స్కూల్‌లో ఇలాంటి గొప్ప క్రీడా మైదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువు, క్రీడలను సమన్వయం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

జీవన జ్యోతి విద్యాసంస్థల అధినేత గురుదేవ్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. బుడిగి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

65 మీటర్ల క్రికెట్ స్టేడియం

ఎడిఫై స్కూల్ ప్రొద్దుటూరు బ్రాంచ్ నిర్వాహకులు అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో 65 మీటర్ల క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ క్రీడా మైదానం రాయలసీమకే గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రికెట్‌తో పాటు స్కేటింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడలకు కూడా పాఠశాలలో సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యను అందించడమే ఎడిఫై స్కూల్ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ స్టేడియాల్లో పిచ్‌లను సిద్ధం చేసే క్యూరేటర్లతోనే ఎడిఫై స్కూల్ క్రికెట్ అరేనాలో పిచ్‌ను సిద్ధం చేయించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ సభ్యుడు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, జీవన జ్యోతి, ఎడిఫై స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు