తెలంగాణలో వాతావరణం.. రానున్న రెండు రోజులూ.. గరం.. గరమే..!
హైదరాబాద్ :తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణం ఎక్కువగా పొడిగానే ఉండనుంది. ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా పొడి, ఎండ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఉదయం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సెప్టెంబర్ 29న దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉండనుంది.
అక్టోబర్ 2 తర్వాత ఈశాన్య దిశ నుంచి గాలుల ప్రభావంతో ఆగ్నేయ తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. రానున్న రోజుల్లో బలమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏర్పడితేనే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. అప్పటివరకు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు లేకుండా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది.