BREAKING
23 ఏళ్ల తర్వాత ఇరాక్ నుండి అమెరికా సైనిక ఉపసంహరణ ట్రంప్, షీ జిన్‌పింగ్ కీలక భేటీ కబడ్డీ స్వర్ణాలు, పతకాల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు ఐరాస వేదికగా భారత్ ఘాటు హెచ్చరిక ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కు కొత్త బలం సౌదీ అరేబియా అణ్వాయుధ ప్రణాళికలపై అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక పర్యాటకం, ఇంధన రంగాల ద్వారా పారిశ్రామికాభివృద్ధి... : సీఎం మోహన్ యాదవ్ ఆసియా క్రీడల మారథాన్‌లో సావన్ బర్వాల్ చారిత్రక రజతం.. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జాతీయ రికార్డు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన పీసీబీ.. పరవాడ ఫార్మాసిటీలో ఆకస్మిక తనిఖీలు నేడు ‘చలో విజయవాడ’.. గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు రాజమండ్రిలో 138 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్.. ఘనంగా శిక్షణ పూర్తి జాతీయ స్థాయిలో ఏపీ ఐ&పీఆర్ శాఖకు అరుదైన గౌరవం.. దక్కిన ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు సర్కారు బడి పిల్లలకు సాయం ఈసీ ఉమ్మడి ప్రకటన అపోహలకు ముగింపు పలికింది. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ ఏడేళ్ల తర్వాత సెప్టెంబర్‌ చివరిలో ఢిల్లీలో వర్షం

సర్కారు బడి పిల్లలకు సాయం

Select Suryaa Now
సర్కారు బడి పిల్లలకు సాయం

- క్రీడా దుస్తులు, ఇతర సామాగ్రి పంపిణీ

- హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులు మర్పల్లి అశోక్.

మండల పరిధిలోని మన్మర్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులే దాతలుగా ముందుకు వచ్చి క్రీడా దుస్తులను అందజేశారు. తమ పిల్లలు ప్రైవేటు బడి విద్యార్థులలాగ  చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు, బూట్లు,బెల్టులు తదితర సామాగ్రికి తమ వంతు సహకారం అందించాలనే మంచి ఆలోచనతో తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మర్పల్లి అశోక్,గ్రామ సర్పంచ్ లాలాపేట బందయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,సమాజం కలిసి పనిచేయాలనీ, కొందరు విద్యార్థులు చదువులో చురుకుగా ఉంటే మరికొందరు క్రీడల్లో చురుకుగా ఉంటారని తెలపడం జరిగింది. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లా సాన్నిస్థాయిని తెలపడం జరిగింది.
తల్లిదండ్రులే దాతలుగా ముందుకు వచ్చి విద్యార్థులకు క్రీడా దుస్తులు, బూట్లు,బెల్టులు అందించడం అభినందనీయమని,ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు మరింత మంది దాతలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
క్రీడా దుస్తులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, చదువులో, క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మర్పల్లి అశోక్ గ్రామ సర్పంచ్ లాలాపేట బందయ్య,ఉప సర్పంచ్ బేగరి శంకరయ్య, వార్డు సభ్యులు కవిత వెంకటేష్, తల్లిదండ్రులు అంతారం నర్సింలు, రామచంద్రయ్య,సాకలి రమేష్, బేగరీ ఈదయ, దండు ఎల్లయ్య, కొమురమ్మ,మణెమ్మ,మాధవి గౌండ్ల నగేష్,ఉపాధ్యాయులు వెంకట మ్మ,శ్రీలత, వెంకటేశ్వరి, చంద్రకళ, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

జానంపేట శివరాజ్ : మేజర్ న్యూస్, షాబాద్.