BREAKING
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఊహించని ట్విస్ట్.. రూ. 15 లక్షలతో బయటకు వెళ్లిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ తాడు సాయంతోనే రాకపోకలు.. పోలవరం ఏజెన్సీలో ఇదీ పరిస్థితి.. కీర్తి సురేశ్ డోరతీ మూవీ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి యూఏఈ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాని ప్యారడైజ్ మూవీలో ప్రస్తావించిన ధూమావతి అమ్మవారు ఎవరో తెలుసా.. ఆసక్తికరమైన పురాణ కథనం రామాయణం సరికొత్త పోస్టర్లు విడుదల.. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లుక్స్ అదుర్స్ ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం, సమాజానికి అద్దం ఐరాస శాంతి పరిరక్షణలో భారత్‌దే కీలక పాత్ర : విదేశాంగ మంత్రి జైశంకర్ తైవాన్ రక్షణ అవసరాలను అమెరికా సంపూర్ణంగా అర్థం చేసుకుంటోంది ధర్మవరం చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుంది :విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్నికల కమిషన్‌ను బీజేపీ జేబు సంస్థగా మార్చారు.. గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి. World Tourism Day: హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకొచ్చే చార్మినార్ చరిత్ర, అద్భుత విశేషాలు ఇవే విపక్షాలు పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎస్ఐఆర్ సర్వేపై మంత్రి నితిన్ నబిన్ ఆగ్రహం

దొరల అణచివేతలను ఎదురించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ

Select Suryaa Now
దొరల అణచివేతలను ఎదురించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ

తిరుమలగిరి మేజర్ న్యూస్ :- భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పెత్తందారీ దేశముఖ్, దొరల అణచివేత "లను ఎదిరించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని తిరుమలగిరి మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరాల వీరేష్ కొనియాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశాల మేరకు, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా పేరాల వీరేష్ మాట్లాడుతూ... "దున్నేవాడిదే భూమి" అనే నినాదంతో గర్జించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తనదైన శైలిలో ఉద్యమించి పేద, బడుగు, బలహీన వర్గాల తరఫున పోరాటం చేసిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని అన్నారు. ఆనాడు దొరలు వేల ఎకరాల భూములను తమ ఆధీనంలో ఉంచుకుని, పేదలతో వెట్టిచాకిరి చేయిస్తూ పొట్టకూటికి కూడా నోచుకోకుండా ఆకలి చావులకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు అండగా నిలబడి దొరల గుండెల్లో దడ పుట్టించిన చరిత్ర ఆమెదని పేర్కొన్నారు.నేటి మారుతున్న కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, సమాజంలో పేద, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, అవినీతిపై ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో

పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో తిరుమ లగిరి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దుంపల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ జేరిపోతుల శోభారాణి, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, మున్సి పాలిటీ వార్డు ఇన్చార్జీలు మూల రాజు, కడెం మల్లయ్య, కందుకూరి లక్ష్మయ్య, ముద్రబోయిన ఉప్పలయ్య, పత్తేపురం సుధాకర్, మాజీ కౌన్సిలర్లు గుగులోతు భాస్కర్ నాయక్, వీర్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని కృష్ణ పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచులు రామోజీ నాయక్, చిరంజీవి నాయక్, బిచ్చు నాయక్, బానోత్ రోజా లక్ష్మణ్, సుజాత రాజశేఖర్ నాయక్, జలాల్పురం గ్రామ శాఖ అధ్యక్షుడు దాచేపల్లి శ్రీను, రాఘవపురం గ్రామ శాఖ అధ్యక్షుడు భీమా నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు పేరాల నరేష్, సంత్ సేవాలాల్ మండల అధ్యక్షుడు బానోతు రాములు నాయక్, ఉడుగు రోహిత్, బుక్య పరదేశి, రాకేష్, సాయిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.