BREAKING
సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం జాషువా కలం సమానత్వానికి వెలుగురేఖ సీఎం ఉత్త చేతులతో రావద్దంటూ ఆటో కార్మికుల నిరసన ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నెలకు రూ.3,000 వరకు పిఎఫ్ జమ? సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన వేళ కేటీఆర్ సంచలన లేఖ జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల పదవీకాలం ముగిసేనా..? పేదల సొంతింటి కలను నిజం చేసిన మంత్రి నారా లోకేశ్ “వేస్ట్ నుంచి ఆర్ట్” కార్యక్రమం. శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ అధ్యక్షుడిగా దేవేందర్ వర్షం దెబ్బ.. భారత్, ఆఫ్ఘన్ మ్యాచ్ రద్దు గుత్తిలో ఘనంగా భగత్‌సింగ్ జయంతి రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ నల్లవెల్లి గణనాథుని లడ్డు రూ.1.30

యూఏఈ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
యూఏఈ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్


కాంగ్రెస్ పార్టీ స్టడీ టూర్‌లో భాగంగా 13 రోజుల విదేశీ పర్యటన
నియోజకవర్గ ప్రజలు సహకరించాలని కోరిన క్యాంపు కార్యాలయం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 27):తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ యూఏఈ దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టడీ టూర్‌లో భాగంగా ఆయన సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు యూఏఈలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెల్లడించింది.ఈ పర్యటన నేపథ్యంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో ఉండరని తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన విషయాలపై ఆయనను నేరుగా కలవాలనుకునే ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.స్పీకర్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు, విజ్ఞప్తులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ టూర్‌లో పాల్గొనేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యూఏఈ పర్యటనకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పేర్కొంది.