సీఎం ఉత్త చేతులతో రావద్దంటూ ఆటో కార్మికుల నిరసన
సీఎం ఉత్త చేతులతో రావద్దంటూ ఆటో కార్మికుల నిరసన
సూర్య రాజన్న సిరిసిల్ల
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆటో కార్మికులు సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న చౌక్ వద్ద ఆటో కార్మికులు ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు.ఈనెల 30న సిరిసిల్ల వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో కార్మికునికి బాకీ పడ్డ 34వేల రూపాయలను చెల్లించాలని నినాదించారు. ఉత్త చేతులతో రావద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు.