శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ అధ్యక్షుడిగా దేవేందర్
జిహెచ్ఎంసి తుక్కుగూడ వార్డు రావిర్యాల లో శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ నూతన అధ్యక్షుడిగా గోనమోని దేవేందర్ ముదిరాజ్(రాజు) ఎకగ్రీవంగా నియమితులయ్యారు. ఆదివారం రావిర్యాల గ్రామం శ్రీఓంకారేశ్వర దేవాలయం ప్రాంగణంలో శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ ఉపాధ్యాక్షుడిగా జెల్లపల్లి బాలారాజ్, పాలకూర్ల
రాజు గౌడ్,గోనమోని శ్రీధర్ ముదిరాజ్, అందె యశ్వంత్, ప్రధాన కార్యదర్శిగా గోనమోని జయప్రకాష్, సహాయ కార్యదర్శులుగా జెల్లపల్లి జగన్, పిట్టల శివ శంకర్, గోనమోని మహేష్ బాబు, మేకల యాదగిరి, కోశాధికారులు అందె మహేష్, నక్క విక్రమ్, సాంస్కృతిక కార్యదర్శులుగా పిట్టల రవి, జెల్లపల్లి దినేష్, క్రీడాకార్యదర్శులు గోనమోని మహేష్ గూదె కార్తీక్, రమేష్ బాబు, సోషల్ మీడియా కన్వీనర్లు గోనమోని శ్రీకర్, పార్లకూర్ల వినీత్ గోనమోని అభినయ్ తేజ, కార్యవర్గ సభ్యులుగా పిట్టల శ్రీకాంత్,నక్క మహేష్, అందె అభిలాష్ గోనమోని వంశీ,నీలం మహేష్, హరికృష్ణ, రాజేష్, శివకుమార్,దీక్షిత్, యశ్వంత్,వంశీ,నిఖిల్, రాజేష్,రణ్ ధీర్,యశ్వంత్, శ్రీశైలం, వంశీ, రాకేష్, ప్రవీణ్, దీనేష్, హర్షవర్ధన్, అర్జున్,
తరుణ్ ప్రశాంత్ కిరణ్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నూతన అధ్యక్షుడు గోనమోని దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. యువజన సంఘం అభివృద్దికి తాను సభ్యులతో కలిసి నిరంతరం కృషి చేస్తామన్నారు. యువతలో క్రీడా, సాంస్కృతిక నైపుణ్యం పెంపొందే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. సంఘం బలోపేతం కోసం కృషిచేసి సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఈ అధ్యక్షపదవి బాధ్యలు కట్టబెట్టినందుకు ప్రతి సభ్యుడికి ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేస్తున్నామన్నారు.
పాల జనార్ధన్ : మేజర్ న్యూస్, మహేశ్వరం.