BREAKING
బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరం సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు" సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన.. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో.. అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి

సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

Select Suryaa Now
సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

-జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

-ఎస్పీ మహేష్ బి గితె, వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష

 

 సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా  ప్రతినిధి 
ఈ నెల 30వ తేదీన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్... ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బై పాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్త్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈఈ ఆర్ అండ్ బీ హెలిప్యాడ్, స్థభ స్థలం వద్ద స్టేజ్, పార్కింగ్ ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి పారిశుధ్య పనులు, తాగు నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్ పీ డీ సీ ఎల్ అధికారులు విద్యుత్ సరఫరా ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని పనులు గడువులోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.