BREAKING
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఊహించని ట్విస్ట్.. రూ. 15 లక్షలతో బయటకు వెళ్లిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ తాడు సాయంతోనే రాకపోకలు.. పోలవరం ఏజెన్సీలో ఇదీ పరిస్థితి.. కీర్తి సురేశ్ డోరతీ మూవీ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి యూఏఈ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాని ప్యారడైజ్ మూవీలో ప్రస్తావించిన ధూమావతి అమ్మవారు ఎవరో తెలుసా.. ఆసక్తికరమైన పురాణ కథనం రామాయణం సరికొత్త పోస్టర్లు విడుదల.. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లుక్స్ అదుర్స్ ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం, సమాజానికి అద్దం ఐరాస శాంతి పరిరక్షణలో భారత్‌దే కీలక పాత్ర : విదేశాంగ మంత్రి జైశంకర్ తైవాన్ రక్షణ అవసరాలను అమెరికా సంపూర్ణంగా అర్థం చేసుకుంటోంది ధర్మవరం చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుంది :విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్నికల కమిషన్‌ను బీజేపీ జేబు సంస్థగా మార్చారు.. గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి. World Tourism Day: హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకొచ్చే చార్మినార్ చరిత్ర, అద్భుత విశేషాలు ఇవే విపక్షాలు పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎస్ఐఆర్ సర్వేపై మంత్రి నితిన్ నబిన్ ఆగ్రహం

భట్టి, దామోదర్ కు అభ్యర్థుల ఎంపిక బాధ్యత

Select Suryaa Now
భట్టి, దామోదర్ కు అభ్యర్థుల ఎంపిక బాధ్యత

హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది. ఖమ్మం–వరంగల్‌–నల్గొండ, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురి పేర్లతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పేర్లను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లు

హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మన్నె సత్యనారాయణరెడ్డి, గౌరీ సతీశ్‌, సామ రామ్మోహన్‌రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఖమ్మం–వరంగల్‌–నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్‌, చనగాని దయాకర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. 

భట్టి, దామోదర్‌లకు బాధ్యతలు

ఖమ్మం–వరంగల్‌–నల్గొండ స్థానం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం ఎంపిక బాధ్యతను మంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలతో పాటు పట్టభద్రులతో సంబంధాలు, క్షేత్రస్థాయి పరిచయాలు, పార్టీ శ్రేణులతో సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఈ నెల 29న కీలక సమావేశం

రాష్ట్ర కాంగ్రెస్‌ పంపిన పేర్లపై పార్టీ అధిష్ఠానం తుది కసరత్తు చేయనుంది. సెప్టెంబర్‌ 29న ఢిల్లీలో జరిగే సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తుది ప్రకటన అధిష్ఠానం నిర్ణయం తర్వాతే వెలువడనుంది.

రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 28 నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభమై, నవంబర్‌ 6 వరకు నమోదుకు అవకాశం ఉండనుంది. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్‌ 30న ప్రకటించనున్నట్లు సమాచారం.