BREAKING
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఊహించని ట్విస్ట్.. రూ. 15 లక్షలతో బయటకు వెళ్లిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ తాడు సాయంతోనే రాకపోకలు.. పోలవరం ఏజెన్సీలో ఇదీ పరిస్థితి.. కీర్తి సురేశ్ డోరతీ మూవీ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి యూఏఈ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాని ప్యారడైజ్ మూవీలో ప్రస్తావించిన ధూమావతి అమ్మవారు ఎవరో తెలుసా.. ఆసక్తికరమైన పురాణ కథనం రామాయణం సరికొత్త పోస్టర్లు విడుదల.. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లుక్స్ అదుర్స్ ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం, సమాజానికి అద్దం ఐరాస శాంతి పరిరక్షణలో భారత్‌దే కీలక పాత్ర : విదేశాంగ మంత్రి జైశంకర్ తైవాన్ రక్షణ అవసరాలను అమెరికా సంపూర్ణంగా అర్థం చేసుకుంటోంది ధర్మవరం చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తుంది :విదేశాంగ మంత్రి జైశంకర్ ఎన్నికల కమిషన్‌ను బీజేపీ జేబు సంస్థగా మార్చారు.. గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి. World Tourism Day: హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకొచ్చే చార్మినార్ చరిత్ర, అద్భుత విశేషాలు ఇవే విపక్షాలు పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎస్ఐఆర్ సర్వేపై మంత్రి నితిన్ నబిన్ ఆగ్రహం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Select Suryaa Now
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తిరుమలగిరి మండలంలోని వివిధ పాఠశాలల్లో విశేష సేవలందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురు ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్, మండల విద్యాధికారి (ఎంఈఓ) ఐ. శాంతయ్య, డిప్యూటీ తహసీల్దార్ జానీ మహ్మద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం దామర శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపికైన ఉపాధ్యాయు లను శాలువాలు కప్పి, మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లాజర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. "వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఖచ్చితంగా దక్కుతుంది. నేడు కాకపోయినా రేపటికైనా ఆ శ్రమకు తగిన ఫలం లభిస్తుంది” అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఏ హోదాలో ఉన్నా నిబద్ధతతో పనిచేస్తే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, నేడు సన్మానం పొందిన ఉపాధ్యాయులే దానికి నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, సన్మాన గ్రహీతలు మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.