BREAKING
సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం జాషువా కలం సమానత్వానికి వెలుగురేఖ సీఎం ఉత్త చేతులతో రావద్దంటూ ఆటో కార్మికుల నిరసన ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నెలకు రూ.3,000 వరకు పిఎఫ్ జమ? సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన వేళ కేటీఆర్ సంచలన లేఖ జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల పదవీకాలం ముగిసేనా..? పేదల సొంతింటి కలను నిజం చేసిన మంత్రి నారా లోకేశ్ “వేస్ట్ నుంచి ఆర్ట్” కార్యక్రమం. శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ అధ్యక్షుడిగా దేవేందర్ వర్షం దెబ్బ.. భారత్, ఆఫ్ఘన్ మ్యాచ్ రద్దు గుత్తిలో ఘనంగా భగత్‌సింగ్ జయంతి రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ నల్లవెల్లి గణనాథుని లడ్డు రూ.1.30

జెల్ పల్లిలో నిమజ్జనం సంపూర్ణం

Select Suryaa Now
జెల్ పల్లిలో నిమజ్జనం సంపూర్ణం

- రూ.2.65 లక్షలు పలికిన గణనాధుని లడ్డూ


జల్ పల్లి సర్కిల్ పరిధిలోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద… శివ రామాంజనేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జనోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ లడ్డూ వేలం పాట భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేలంలో బీజేపీ నాయకులు పేరమోని నరేష్ యాదవ్ పాల్గొని స్వామివారి మహా ప్రసాదమైన లడ్డూను రూ. 2.65 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు నరేష్ యాదవ్ ను అభినందించి, లడ్డు ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక స్వామి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపం నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- అంకం జగన్ : మేజర్ న్యూస్, జెల్ పల్లి.