BREAKING
23 ఏళ్ల తర్వాత ఇరాక్ నుండి అమెరికా సైనిక ఉపసంహరణ ట్రంప్, షీ జిన్‌పింగ్ కీలక భేటీ కబడ్డీ స్వర్ణాలు, పతకాల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు ఐరాస వేదికగా భారత్ ఘాటు హెచ్చరిక ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కు కొత్త బలం సౌదీ అరేబియా అణ్వాయుధ ప్రణాళికలపై అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక పర్యాటకం, ఇంధన రంగాల ద్వారా పారిశ్రామికాభివృద్ధి... : సీఎం మోహన్ యాదవ్ ఆసియా క్రీడల మారథాన్‌లో సావన్ బర్వాల్ చారిత్రక రజతం.. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జాతీయ రికార్డు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన పీసీబీ.. పరవాడ ఫార్మాసిటీలో ఆకస్మిక తనిఖీలు నేడు ‘చలో విజయవాడ’.. గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు రాజమండ్రిలో 138 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్.. ఘనంగా శిక్షణ పూర్తి జాతీయ స్థాయిలో ఏపీ ఐ&పీఆర్ శాఖకు అరుదైన గౌరవం.. దక్కిన ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు సర్కారు బడి పిల్లలకు సాయం ఈసీ ఉమ్మడి ప్రకటన అపోహలకు ముగింపు పలికింది. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ ఏడేళ్ల తర్వాత సెప్టెంబర్‌ చివరిలో ఢిల్లీలో వర్షం

నేడు ‘చలో విజయవాడ’.. గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు

Select Suryaa Now
నేడు ‘చలో విజయవాడ’.. గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడ: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ సచివాలయ ఉద్యోగులు నేడు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియను పూర్తిచేయడంతో పాటు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అదేవిధంగా ఉద్యోగులపై నమోదైన అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే విజయవాడలో ఆందోళనకు పిలుపునిచ్చినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

అనుమతులు లేవంటున్న పోలీసులు

మరోవైపు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అనుమతి లేకుండా విజయవాడకు తరలివచ్చే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే ఉద్యోగులను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టుబడుతుండగా, అనుమతులు లేవని పోలీసులు చెబుతున్న పరిస్థితుల్లో నేడు విజయవాడలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.