BREAKING
23 ఏళ్ల తర్వాత ఇరాక్ నుండి అమెరికా సైనిక ఉపసంహరణ ట్రంప్, షీ జిన్‌పింగ్ కీలక భేటీ కబడ్డీ స్వర్ణాలు, పతకాల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు ఐరాస వేదికగా భారత్ ఘాటు హెచ్చరిక ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కు కొత్త బలం సౌదీ అరేబియా అణ్వాయుధ ప్రణాళికలపై అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక పర్యాటకం, ఇంధన రంగాల ద్వారా పారిశ్రామికాభివృద్ధి... : సీఎం మోహన్ యాదవ్ ఆసియా క్రీడల మారథాన్‌లో సావన్ బర్వాల్ చారిత్రక రజతం.. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జాతీయ రికార్డు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన పీసీబీ.. పరవాడ ఫార్మాసిటీలో ఆకస్మిక తనిఖీలు నేడు ‘చలో విజయవాడ’.. గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు రాజమండ్రిలో 138 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్.. ఘనంగా శిక్షణ పూర్తి జాతీయ స్థాయిలో ఏపీ ఐ&పీఆర్ శాఖకు అరుదైన గౌరవం.. దక్కిన ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు సర్కారు బడి పిల్లలకు సాయం ఈసీ ఉమ్మడి ప్రకటన అపోహలకు ముగింపు పలికింది. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ ఏడేళ్ల తర్వాత సెప్టెంబర్‌ చివరిలో ఢిల్లీలో వర్షం

జాతీయ స్థాయిలో ఏపీ ఐ&పీఆర్ శాఖకు అరుదైన గౌరవం.. దక్కిన ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు

Select Suryaa Now
జాతీయ స్థాయిలో ఏపీ ఐ&పీఆర్ శాఖకు అరుదైన గౌరవం.. దక్కిన ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల (ఐ&పీఆర్) శాఖకు జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. సమాచార వ్యాప్తి, పాలనా వ్యవహారాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. జాతీయ వేదికపై రాష్ట్ర విభాగానికి దక్కిన ఈ గౌరవం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అవార్డుల కేటాయింపులో ముఖ్యంగా జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రిడిటేషన్ల ప్రక్రియలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీ ఐ&పీఆర్ శాఖ రూపొందించిన మీడియా అక్రిడిటేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్ సిల్వర్ పురస్కారం దక్కింది. గతంలో ఉన్న మాన్యువల్ విధానాలకు స్వస్తి పలికి, అక్రిడిటేషన్ల దరఖాస్తు నుంచి పరిశీలన, కార్డుల జారీ వరకు సమస్త ప్రక్రియను ఆన్‌లైన్ చేసి అత్యంత పారదర్శకతతో రికార్డు సమయంలో పూర్తి చేయడాన్ని జ్యూరీ సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. అర్హులైన పాత్రికేయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ విధానంలో గుర్తింపు కార్డులు అందించడం ద్వారా శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది.

మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీ డిజిటల్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్ విభాగంలో విశేష సేవలందించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అత్యున్నత గోల్డ్ స్కోచ్ అవార్డు లభించింది. ప్రభుత్వ ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సరికొత్త డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లినందుకు ఈ పురస్కారం దక్కింది. జాతీయ స్థాయిలో లభించిన ఈ ద్వంద్వ పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పాలనా విధానాలకు నిదర్శనమని, భవిష్యత్తులోనూ ప్రజా సేవలో డిజిటల్ సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగిస్తూ అత్యుత్తమ ప్రమాణాలు కొనసాగిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.