తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
అనంతపురం బ్యూరో
తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
: తిమ్మమ్మ మర్రిమాను వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతానికి ఉన్న చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
తిమ్మమ్మ మర్రిమాను విశిష్టతను రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింతగా ప్రచారం చేయాలని, పర్యాటకుల సౌకర్యార్థం అవసరమైన వసతులను మెరుగుపరచాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పర్యాటక శాఖ సిబ్బంది, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు.