ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు
ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు
ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు
నెల్లూరు, మేజర్ న్యూస్ : బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో అక్టోబర్ 1న ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సమయాల్లో మార్పు చేశారు. ఆ రోజు ఉదయం పింఛన్ల పంపిణీ ఉండదని, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు అందజేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసిన అనంతరం మధ్యాహ్నం నుంచి వాలంటీర్లు/సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేపట్టేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.