ప్రజలే ప్రథమం.. పరిష్కారమే పరమార్థం
ప్రజలే ప్రథమం.. పరిష్కారమే పరమార్థం
కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని జనసేన నాయకుల ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పాత 16వ డివిజన్–ప్రస్తుత 21వ డివిజన్ పరిధిలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. ప్రతి గడపను పలకరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నెల్లూరు నగర అభివృద్ధికి మంత్రి పొంగూరు నారాయణ చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు.
ప్రజల నుంచి వచ్చే వినతులపై స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే జనసేన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. నెల్లూరు నగర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వారు ప్రజలను కోరారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజా 2026 అంచనాల్లో భారత్ ఆర్థిక వృద్ధిని 6.4 శాతంగా అంచనా వేసిందని తెలిపారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, ప్రవల్లిక, ప్రశాంతి, విజయ, సునీత, కృష్ణవేణి, కుమారి, కృష్ణారెడ్డి, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.