BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు ఏఐతో మానవాళి మనుగడకే పెను ముప్పు.. సంచలన హెచ్చరికలు చేసిన బిల్ గేట్స్ మద్యం మత్తులో ఘర్షణ.. సవతి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....! ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లోకి చొరబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భారత్‌కు హెచ్చరికగా నిలిచిన ఏఐ ఏజెంట్ ఉల్లంఘన తక్కువ ఖర్చుతో మురుగునీటి శుద్ధి విధానాన్ని రూపొందించిన 20 ఏళ్ల యువకుడికి యూఎన్‌డీపీ గుర్తింపు ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి మహిళ సమైక్య సభ్యుల సమావేశం. పొదలకూరు పోలేరమ్మ జాతరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానం తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రజలే ప్రథమం.. పరిష్కారమే పరమార్థం యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ తెలంగాణలో వాతావరణం.. రానున్న రెండు రోజులూ.. గరం.. గరమే..! వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం... కలకలం రేపుతున్న ఘటన, గోశాలపై పంజా పల్లె పండుగకు కోవూరు నుంచి భారీ జనసమీకరణ

పామూరుకు నేడు మంత్రులు రాక

Select Suryaa Now
పామూరుకు నేడు మంత్రులు రాక

 

  • పల్లె పండుగ–3పై సమీక్ష
  • పామూరుకు రానున్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్‌ రెడ్డి
  • ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రామపురం సభ ఏర్పాట్లపై సమీక్ష

పామూరు, సూర్య ప్రతినిధి : 

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామపురం వద్ద నిర్వహించనున్న పల్లె పండుగ–3 సభ ఏర్పాట్లపై నేడు పామూరులో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పామూరు పట్టణంలోని పువ్వాడి రాధాకృష్ణ కల్యాణ మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే  డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  రామపురం వద్ద నిర్వహించనున్న పల్లె పండుగ–3 సభను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, నాయకుల సమన్వయం, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ముఖ్య నాయకులు, 25 గ్రామాల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ కమిటీ ఇన్‌చార్జిలు, టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు హాజరు కావాలని మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  పామూరు మండల మాజీ అధ్యక్షులుపువ్వాడి వెంకటేశ్వర్లు  కోరారు.