వెన్నముద్దల బతుకమ్మ శుభాకాంక్షలు - కాసాని పద్మ*
సూర్య అశ్వరావుపేట,అశ్వారావుపేట బిఆర్ఎస్ నాయకురాలు కాసాని పద్మ మండల ప్రజలకు వెన్నముద్దల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ
పూలను పూజించే పండుగ.. ఆడపడుచుల ఆనందాల పండుగ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ!
రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా సిరిసంపదలను నింపాలని, ప్రతి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలి. ఆడపడుచుల జీవితాల్లో ఆనందాల వెలుగులు నిండాలి. బతుకమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాననీ తెలిపారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట