వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు
వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి రాకేష్ రావు
పరకాల, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్,
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో స్థానిక బీఆర్‌ఎస్ కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి, రాకేష్ రావు విస్తృతంగా పర్యటించారు. వార్డులోని వివిధ కాలనీలో తిరుగుతూ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తాగునీటి సరఫరాలో లో ప్రెషర్ సమస్యతో పాటు పలు ప్రాంతాల్లో సక్రమంగా నీరు అందడం లేదని కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ కాలువలను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు వీధుల్లో స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే నూతన సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు.
ప్రజలు తెలిపిన సమస్యలపై కౌన్సిలర్ సానుకూలంగా స్పందించారు. డ్రైనేజీ క్లీనింగ్, వీధి దీపాల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆదేశించారు. తాగునీరు, సీసీ రోడ్ల వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. వార్డును అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాడి భగవాన్ రెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ బియా బానీ,వార్డ్ అధ్యక్షులు బండి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి నాగరాజు,నాయకులు బొల్లెడ్ల కృపేందర్ రెడ్డి, ఎండీ మంజూర్ అలీ, ఎండీ ఖాజా,ఎండీ ఖలీమ్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.