తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ
కోహెడ ; కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో కోహెడ మండలం మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ పాటలు పాడారు మాజీ ఎంపీపీ కొక్కులకీర్తి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ తీరొక్క పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ అక్కాచెల్లెళ్ల ఆత్మీయతను ఆడపడుచుల ఐక్యతను చాటే గొప్ప పండుగ బతుకమ్మ తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు సద్దుల బతుకమ్మతో ఘనమైన ముగింపు పలుకుతాం తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా బతుకమ్మను మర్చిపోకుండా జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనం మన పండుగలను మన సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందిఅని ఆమె కొనియాడారు. అనంతరంమాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ బస్వాపూర్ గ్రామ ప్రజలకు కోహెడ మండల ప్రజలందరికీసద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.