మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : ప్రజలు తనకు అవకాశం ఇస్తే వార్డును అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని 21వ వార్డు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బర్నేపల్లి రవికుమార్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నానని,ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వివిరామ కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.తాను ఏనాడు పదవుల కోసం ఎంపర్లాడలేదన్నారు.పార్టీ అధిష్టానం తనను జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయడంతోపాటు 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని,వార్డులో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.ప్రజల ఆశీస్సులు,కూటమి నాయకుల సహకారంతో విజయం సాధిస్తానని బర్నేపల్లి ధీమా వ్యక్తం చేశారు.తనకు ఈ అవకాశం కల్పించిన బీజేపి అధిష్టానానికి,స్థానిక నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం