BREAKING
*గాజు గ్లాసుకు మన ఓటు… అభివృద్ధికి తొలి మెట్టు!* తిరుపతిలో వాక్య సిల్వర్ తొలి షోరూమ్ ప్రారంభం – దక్షిణ భారతదేశంలో భారీ విస్తరణకు ప్రణాళికలు ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వైభవంగా 'సద్దుల బతుకమ్మ - మానకొండూరు మండలంలో కోలాహలంగా వేడుకలు ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 తుది గడువు నమోదుకు మరో అవకాశం.. గడువులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి : అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి! శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు నర్సీపట్నం చైర్మన్ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున రమాదేవి నామినేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ షో జంపింగ్ విజేతలకు పతకాలు ప్రదానం హెచ్ పిఆర్ సిలో రెండవ నేషనల్ క్వాలిఫైయర్ సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్యామలాంబిక అమ్మవారి ఆలయం వార్షికోత్సవం పలాసలో మొత్తం 167 నామినేషన్లు దాఖలు.

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

Select Suryaa Now
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : లష్కర్‌లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, డీసీసీ సెక్రటరీ గుండెల్లి దేవి వరప్రసాద్, భాస్కర్ గుప్తా, శ్రీకాంత్ చారి, రఘు యాదవ్, ప్రేమ్ సాగర్, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.