అష్టాదశ శక్తిపీఠాల పూజా మహోత్సవంతో భక్తిపారవశ్యంలో పరిగి
పరిగి, మేజర్ న్యూస్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బహార్పేట్లో భవాని యూత్ అసోసియేషన్, స్రవంతి భవాని స్వాముల బృందం ఆధ్వర్యంలో అష్టాదశ శక్తిపీఠాల పూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భాస్కర్ యోగి మాట్లాడుతూ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని నిష్ఠతో పూజించడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయని, అష్టాదశ శక్తిపీఠాలను స్మరించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని పేర్కొన్నారు. భవాని మాలధారులు నియమ నిష్ఠలతో అమ్మవారిని ఆరాధించాలని సూచించారు. దుర్గాభవాని నామస్మరణతో పరిగి పట్టణం భక్తిమయంగా మారింది. అమ్మవారి పూజల అనంతరం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజా నిర్వాహకులు స్రవంతి, చరణ్, ఓం ప్రకాష్, దేవకన్నా, జస్వంత్, ఓంకార్, నవీన్, లడ్డు, ఉప్పరి స్వాతిక్ సాయి, భవాని మంజుల, భవాని మాత సాయికిరణ్, పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్, గిరిధర్ రెడ్డి, శ్రీకాంత్తో పాటు స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.