మున్సిపల్ వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్
రేపల్లె మేజర్ న్యూస్;
వైయస్సార్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి ఆదివారం నామినేషన్ ను దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా నియోజకవర్గ సమన్వయకర్త పిటా నాగమోహన్ కృష్ణ, సీనియర్ నాయకులు గూడపాటి శ్రీనివాసరావు (జి.ఎస్) లతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఇన్చార్జి పీటా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని, ప్రజల సమస్యలను పట్టించుకునే అభ్యర్థులను ఎంపిక చేశాం అని తెలిపారు. విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.మున్సిపల్ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే ఎన్నికలు కాదని పట్టణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేసే అభ్యర్థులను వైయస్సార్ పార్టీ బరిలోకి దించిందన్నారు.