కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా అవర్ణ నామినేషన్ దాఖలు
రేపల్లె మేజర్ న్యూస్; కూటమి నాయకులు కార్యకర్తలు నడుమ ఉత్సాహభరితంగా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి కుర్ర అవర్ణ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు నియోజకవర్గ పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మమ్మునేనీ వెంకటసుబ్బయ్య, అన్నా బత్తిన జయలక్ష్మి, అనగాని శివప్రసాద్ లతో కలిసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని
మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు పూర్తయ్యాయని ఎన్నికల కూడా ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రజలు గొడ్డలి పార్టీని నమ్మే విధంగా లేరని అది గమనించిన గొడ్డలి పార్టీ అధినేత రాష్ట్రంలో అలజడిలో సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు చేసిన దురాగతాలను ప్రజలు గుర్తుంచుకున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తున్నారని తెలిపారు పట్టణంలో వందల కోట్లు కేటాయించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేమని తాము చేసిన అభివృద్ధి మున్సిపల్ విజయానికి చిహ్నం గా మారుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి అభ్యర్థులకు ఘన విజయం
అందించాలని కోరారు.