సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సూర్య నేరడిగొండ: మండల కేంద్రంలో నాబార్డ్ వారి తెలంగాణ రాష్ట్ర మార్క్ పేడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార ద్వారా ఏర్పాటు చేసిన సోయాబీన్ కొలుపు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అలాగే రైతుల దళారుల బారిన పడకుండా తమ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పంటలు తాగిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కోయల కృషి చేస్తానని తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శంగా నిర్వహించాలని అలాగే రైతులకు అవసరమైన సహకారం అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అలాగే రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలకు ప్రధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం చైర్మన్ సాబ్లె కిషోర్, స్థానిక సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, మాజీ చైర్మన్ నానక్ సింగ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రాథోడ్ సురేందర్, సర్పంచులు మహేందర్ రెడ్డి,నవీన్, గంగాధర్ స్వామి, సుజిల్, ప్రతాప్, శోభన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పద్మనాభరెడ్డి,అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.