కరీంనగర్‌లో 45వ జూనియర్స్ షూటింగ్ బాల్ టోర్నమెంట్
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
యునైటెడ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో 45వ జూనియర్స్ షూటింగ్ బాల్ ఉమ్మడి జిల్లా టోర్నమెంట్, సెలెక్షన్ ట్రయల్స్‌ను కరీంనగర్‌లోని సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో బాలబాలికలు కలిపి సుమారు 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్ ఫాదర్ సంతోష్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముఫజిల్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంతోష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రకాష్, ఫర్హాన్ మస్తాన్, పెద్దపల్లి జిల్లా కోచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పాఠశాలలకు చెందిన కోచ్‌లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు. సెలెక్షన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.