BREAKING
రష్మిక 'మైసా' టీజర్ రెస్పాన్స్: ఊహించని మాస్ అవతార్‌తో మైండ్ బ్లాక్ చేసిన నేషనల్ క్రష్ భగవంతుడు అందరికీ ఒక్కడే జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ సదస్సును ప్రారంభించనున్న అమిత్ షా ఎస్ఈసీఐ 15 ఏళ్ల ప్రస్థానం, పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశపు పెరుగుతున్న నాయకత్వానికి నిదర్శనం యువత భవితే కూటమి ప్రభుత్వ లక్ష్యం నేషనల్ ఫార్ములేరీ ఆఫ్ ఇండియా 2026ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చిన్నారి వైద్యానికి మంత్రి సుభాష్ మానవతా హస్తం అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిశ్రీకి ఆర్థిక సాయం కీసరలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం జైపూర్‌లో WWF గ్లోబల్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ ​కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ! ​టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ 4వ క్లౌడ్ రీజియన్ ప్రారంభం అనీషా వలలో జూనియర్ అసిస్టెంట్,అవుట్సోర్సింగ్ సిబ్బది. ఉండవల్లి గుహాలయాల ప్రత్యేకత.. ఇరవై అడుగుల ఏకశిలా అనంత పద్మనాభస్వామి శిల్పకళా వైభవం! భారత్ వర్సెస్ జపాన్ టీ20 పోరుపై తుపాను ముప్పు: మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉందా? నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ వివాదం: స్విట్జర్లాండ్ కెప్టెన్ గ్రానిట్ జాకాపై వేటు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

అక్టోబర్ 1లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

Select Suryaa Now
అక్టోబర్ 1లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి


జిల్లా వ్యవసాయాధికారి కవిత సూచన
అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి
ఏఈఓలు, మీసేవ, సిఎస్ సి కేంద్రాల ద్వారా నమోదుకు అవకాశం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21):
రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర సేవలను నిరంతరాయంగా పొందేందుకు 'ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ' తప్పనిసరి అని జిల్లా వ్యవసాయాధికారి కవిత తెలిపారు. 2026 అక్టోబర్ 1వ తేదీలోగా జిల్లాలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు, రాయితీ సేవలు పొందడానికి ఈ ఐడీ ఎంతో కీలకమని పేర్కొన్నారు. రైతులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ స్థితి (Status)ని తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://tlfr.agristack.gov.in/farmer/registry ని సందర్శించి ఐడీని ధృవీకరించుకోవచ్చని సూచించారు.ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోని రైతులు వెంటనే తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO)ను కానీ, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)/మీసేవ కేంద్రాలను కానీ సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి క్లస్టర్ల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు నిలిచిపోకుండా ఉండాలంటే రైతులందరూ వెంటనే స్పందించి అక్టోబర్ 1లోగా ఫార్మర్ ఐడీ పొందాలని ఆమె కోరారు.