BREAKING
అక్టోబర్ 1లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ప్రజా ప్రభుత్వంలో పల్లెలో అభివృద్ధి పరుగులు  మొరాకో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు: మార్కెట్లు, సోషల్ మీడియాలో పార్టీల ముమ్మర ప్రచారం రవితేజ 'ఇరుముడి' సంచలనం: బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన మైలురాయి దాటిన కలెక్షన్లు సూడాన్‌లో మానవతా కాల్పుల విరమణల ఘోర వైఫల్యం: ఆకలి కేకల్లో లక్షలాది మంది.. బాధ్యులెవరు? ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి చైనా కమ్యూనిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం: ఇద్దరు అగ్రశ్రేణి సైనిక జనరల్స్‌పై బహిష్కరణ వేటు.. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనల ఆరోపణలు పెట్రోల్ పంపుల్లో రూ. 2000 మించితే యూపీఐ చెల్లింపులు నిలిపివేత: యజమానుల సంచలన నిర్ణయం కరీంనగర్‌లో 45వ జూనియర్స్ షూటింగ్ బాల్ టోర్నమెంట్ నేపాల్‌లో భోటేకోశి వరద బాధితులకు సురక్షిత పునరావాసం: స్థానిక సంస్థలతో ప్రభుత్వ విస్తృత సంప్రదింపులు గణపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్ ‘రాకా’: చిత్ర పరిశ్రమలో అరుదైన ఘనత ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ: సీసీటీవీల్లో 105 ఘటనలు నిక్షిప్తం, సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక

ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా

Select Suryaa Now
ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా
 
కరీంనగర్ రీజియన్‌లో వేడెక్కనున్న గుర్తింపు సంఘం ఎన్నికల సమరం…
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
 
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నగారా మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, అక్టోబర్ 17న ఫలితాలు ప్రకటించనున్నారు.
కరీంనగర్ రీజియన్‌లోని డిపోలు, వర్క్‌షాపుల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. వేతన సవరణ, డీఏలు, బకాయిలు, బోనస్, సర్వీస్ నిబంధనలు, పని ఒత్తిడి, సిబ్బంది కొరత, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు ప్రచారంలో ప్రధాన అంశాలుగా మారనున్నాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సంఘం, తెలంగాణ వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
సెప్టెంబర్ 26న పోటీ చేసే యూనియన్లకు ఎన్నికల గుర్తులు కేటాయించనుండటంతో ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనా ఎన్నికల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన సంఘానికి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వంతో అధికారికంగా చర్చించే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.