నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలించిన బిజెపి నాయకులు
సూర్య బాన్సువాడ ::
బాన్సువాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను స్థానిక భాజపా నాయకులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాన్సువాడ పట్టణానికి తాగునీటి సౌకర్యార్థం అమృత్.2 కింద 52 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, మంజూరు చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తికాలేవన్నారు. బాన్సువాడ పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య తీర్చడానికి నరేంద్ర మోడీ 52 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, ముఖ్యంగా బాన్సువాడ పట్టణంలో ఆరు వాటర్ ట్యాంకులు .పైపులైన్లు. పంప్ హౌస్ కు ఈ నిధులు మంజూరు చేశారని, మంజూరు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పట్టణంలోని ట్యాంకులు పైపులైన్లు పనులు జరగడం లేదు చాలా చోట్ల ట్యాంకులు సగం వరకు పని చేసి ఆపివేయడంతో ట్యాంకుల నిర్మాణం కోసం వేసిన సలాక ఎండలో ఎండి వానలో తడిసి తుప్పు పడుతుంది అయినప్పటికీ సంబంధిత అధికారులు గానీ నాయకులు గానీ ఆ కాంట్రాక్టు పైన ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు. నాయకులు పనులు పూర్తిచేసి బాన్సువాడ పట్టణ ప్రజలకు మంచి నీటి సమస్యను తీర్చాలని. సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, లేనియెడల బాన్సువాడ ప్రజల తరఫున బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, బిజెపి నాయకులు చీకట్ల రాజు, కొండని గంగారం, పురుషోత్తం, మహేందర్, ప్రదీప్, పనేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.