పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS
-ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి
-చట్ట పరిధిలో సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS
నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు ఫిర్యాదిదారుల నుంచి *105* ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ గారు స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని,నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని,ఫిర్యాదుల పట్ల అలసత్వం వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అందజేయాలన్నారు.