BREAKING
కలెక్టర్ 'అమ్మ' కడుపు నిండా భోజనం, కానీ కన్నీళ్లు తుడవని న్యాయం పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

Select Suryaa Now
క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

సర్పంచ్,సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ - వీరగొని రాజ్ కుమార్

సాఫ్ట్ బాల్ పోటీలలో వరంగల్ జట్టుకు తృతీయ స్థానం రావడంతో క్రీడాకారులను అభినందించిన సర్పంచ్


గీసుగొండ సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ (సూర్య)విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ అన్నారు. సెప్టెంబర్ 19 నుండి 20 వరకు నిజాంబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి స్టేడియంలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాలికల పోటీలలో వరంగల్ జట్టు ప్రాతినిధ్య వహించి తృతీయ స్థానం సాధించడంతో సర్పంచ్,సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరగొని రాజ్ కుమార్ క్రీడాకారులను అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ..
క్రీడాకారులను ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని,క్రీడాకారులకు ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తానని హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఉద్యోగంలో 2 శాతం రిజర్వేషన్ కల్పించిందని,క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ పూజారి అశోక్ బాబు మాట్లాడుతూ..నిజాంబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి స్టేడియం లో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాలికల పోటీలలో వరంగల్ జట్టు ప్రాతినిధ్య వహించి తృతీయ స్థానం పొందిందని, ఏ.తనుశ్రీ పోటీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి వరంగల్ జిల్లా జట్టు తృతీయ స్థానం రావడానికి కృషి చేసిందని, రాష్ట్రస్థాయి బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.వైస్ ఎస్ ఓ బి.అనిల్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణించగలరని క్రీడాకారులను ఉద్దేశించి అభినందించినారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ ఉప సర్పంచ్ కోట ప్రమోద్, వరంగల్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్  భీమగాని ముఖర్జీ, సృజన్ ప్రసాద్ రావు    వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ పి సాంబశివరావు,సెక్రెటరీ టి.రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ పి.సాంబ మూర్తి,పిఈటి ఎస్ ఈశ్వర్, పి.ప్రశాంత్ పాల్గొన్నారు.