BREAKING
పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి

అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న

Select Suryaa Now
అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న

అన్ని దానాలలో  కెల్లా అన్నదానం మిన్న 
- మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి 
- నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు వాడొద్దన్న ఎస్సై సతీష్ 
మరిపెడ, సెప్టెంబర్ 21,మేజర్ న్యూస్(సూర్య):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కూన్య తండా గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి స్థానిక ఎస్సై గాండ్రాతి సతీష్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని పేర్కొన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప సేవా కార్యక్రమమని, భక్తితో నిర్వహించే అన్నదానం ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.గణనాథుని ఆశీస్సులతో భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు వాడొద్దని సూచించారు.
అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను, నిర్వాహకులను చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, ఎస్సై సతీష్ అభినందించారు.
*నవరాత్రి ఉత్సవాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం*
మరిపెడ పట్టణంలోని శ్రీరామాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం షేక్ రహిమోద్దీన్ -రషీదా బేగం దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచారు.ఈ అన్నదాన కార్యక్రమం మానవత్వం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.