BREAKING
పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి

సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

Select Suryaa Now
సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

-1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
-నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల్లో రక్తహీనతను తగ్గించడంతో ఆరోగ్యకరమైన శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది
-జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా

నంద్యాల అర్బన్ : సెప్టెంబర్ 25వ తేదీన జిల్లావ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తెలిపారు. సోమవారం ఉదయం పీ జీ ఆర్ఎస్ (PGRS) హాలు నందు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day పై జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శారదా బాయి, జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల సమగ్ర శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యకరమైన బాల్యానికి నులిపురుగుల నివారణ ముఖ్యమైందనీ,ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యా శాఖ, మున్సిపల్ పరిపాలన శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, సంబంధిత శాఖల అధికారులు  సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని అర్హులైన పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 4613 పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్  కళాశాలలు డిగ్రీ కళాశాల పరిధిలోని సుమారు 4,46400 మంది పిల్లలు విద్యార్థులకు నివారణ మాత్రలు అందించడమే కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు 200 మి.గ్రా. సగం మాత్రను బాగా పొడి చేసి, నీటిలో కలిపి తాగించాలి. 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు 400 మి.గ్రా. నమిలి మింగేలా చూడాలన్నారు. ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తర్వాత మాత్రమే మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. నులు పురుగులు నివారణ మాత్రమే తీసుకోవడంతోపాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఆయా విద్యా సంస్థలు పంపిణీ చేసిన మాత్రల వివరాలను ఏఎన్ఎం, ఎంపీడీవో లాగిన్ లో కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు లేదా అంగన్‌వాడీ కార్యకర్తల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే పిల్లలకు అక్కడికక్కడే మాత్రలు వేయించాలన్నారు. మాత్రలు తీసుకున్న అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, వైద్య పరీక్షల సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు సాధారణంగా సురక్షితంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, నులిపురుగుల భారం ఎక్కువగా ఉన్న కొంతమంది పిల్లల్లో మాత్ర తీసుకున్న అనంతరం స్వల్పంగా వికారం, కడుపునొప్పి లేదా వాంతులు వంటి అసౌకర్యాలు కనిపించే అవకాశం ఉందని  తెలిపారు. అలాంటి సందర్భాల్లో భయపడకుండా వెంటనే అక్కడి వైద్య సిబ్బందినీ సంప్రదించాలన్నారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు పోషకాహార స్థితి, ఏకాగ్రత మరియు ఆరోగ్యకరమైన శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు సెప్టెంబర్ 25న నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా  పూర్తి సహకారం అందించాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి అధికారులు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మధ్యాహ్న భోజనం సమయంలో స్వయంగా పాల్గొని పిల్లలందరికీ నులు పురుగుల నివారణ మాత్రలు అందేలా చూడాలని తెలిపారు. కావున జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల అర్హులైన పిల్లలందరికీ మాత్రలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 
ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు.