BREAKING
తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు! బిగ్‌బాస్ 10 నుంచి నటుడు కృష్ణుడు ఎలిమినేట్: రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా? నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలించిన బిజెపి నాయకులు కలెక్టర్ 'అమ్మ' కడుపు నిండా భోజనం, కానీ కన్నీళ్లు తుడవని న్యాయం పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

Select Suryaa Now
మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

-కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి తీవ్ర ఆగ్రహం

అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు, నేడు మైనార్టీల స్థలాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేయడం ఘోరాతిఘోరమని , స్వయంగా ప్రభుత్వమే మైనార్టీల హక్కులు, స్థలాలను కబ్జా చేసే దుస్థితికి దిగజారింది" అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎస్డీపీఐ (SDPI) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి శిల్పా రవిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషాతో కలిసి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల సంక్షేమం, విద్య కోసం ఎంతో కృషి చేశారు. అందులో భాగంగానే నంద్యాలలో ఉర్దూ కళాశాల వసతిగృహం భవనాలను నిర్మిస్తే, ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించుకోవాలని చూడటం దారుణం అన్నారు. వక్ఫ్ బోర్డు, మైనార్టీల స్థలాలను కేవలం వారి అభ్యున్నతికే ఉపయోగించాలి తప్ప ప్రభుత్వ అవసరాలకు వాడరాదన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కాస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ల ఊసే లేదు. రైతులకు 'రైతు భరోసా' ఎగ్గొట్టి వారిని రోడ్డున పడేసిన దౌర్భాగ్య ప్రభుత్వం అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  మైనార్టీల హక్కులను కాలరాస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బాధితులు, ప్రజాసంఘాలు చేసే ప్రతీ పోరాటానికి వైఎస్సార్సీపీ వెన్నుముకగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్ కార్యదర్శి ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ తమిమ్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, గన్ని కరీం, జలీల్, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.