BREAKING
తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు! బిగ్‌బాస్ 10 నుంచి నటుడు కృష్ణుడు ఎలిమినేట్: రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా? నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలించిన బిజెపి నాయకులు కలెక్టర్ 'అమ్మ' కడుపు నిండా భోజనం, కానీ కన్నీళ్లు తుడవని న్యాయం పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా

Select Suryaa Now
నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా

-మద్దతు ప్రకటించిన జిల్లా సర్వేయర్ల సంఘం, జిల్లా వీఆర్ ఓల సంఘం నాయకులు

నంద్యాల అర్బన్:
నంద్యాల జిల్లా కేంద్రంలోని నంద్యాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆరవ రోజు  వీఆర్ఎ లు ధర్నా నిర్వహించారు. నంద్యాల మండల అధ్యక్షుడు అక్తర్, గౌరవ అధ్యక్షుడు మౌలాలి, వీఆర్ఏలు శివ, శివలింగం, జయ కృష్ణ, వర ప్రసాద్, నరసింహ, బ్రహ్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి వి ఆర్ ఏ లు  సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నామన్నారు. వీఆర్ లకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ ఓ లుగా నియమించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం అన్నారు. అర్హులైన వి ఆర్ ఏ లకు ప్రమోషన్స్ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత పోరాటం చేస్తామన్నారు. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వీఆర్ఏలకు హామీ ఇచ్చారని ఇచ్చిన హామీల ప్రకారం వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల ధర్నాకు నంద్యాల జిల్లా సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు శివప్రసాద్, సర్వేయర్లు శివ, లక్ష్మి నారాయణ, మద్దతు ప్రకటించారు. అంతేకాక వీఆర్ఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఖాజా హుసేన్, ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయక్, ఉపాధక్షుడు సుబ్బారెడ్డి, రామ్ మనోహర్, మురళి, సల్మాన్, జ్యోతి, తదితర వీఆర్ఓలు మద్దతు ప్రకటించారు.