BREAKING
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు: నేటి పసిడి, వెండి రేట్ల వివరాలు ఇవే సమవర్తి టీజర్ లాంచ్: 'గ్రేట్ అడ్వెంచర్ ఫీల్ కలిగిస్తుంది' అన్న హీరో సత్యదేవ్ తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు! బిగ్‌బాస్ 10 నుంచి నటుడు కృష్ణుడు ఎలిమినేట్: రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా? నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలించిన బిజెపి నాయకులు కలెక్టర్ 'అమ్మ' కడుపు నిండా భోజనం, కానీ కన్నీళ్లు తుడవని న్యాయం పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 105 ఫిర్యాదులు -జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా

రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు

Select Suryaa Now
రోడ్లపై ధాన్యం, ఆరబెట్టడం వల్ల తీవ్ర ప్రమాదాలు


రోడ్లపై ఆరబెడితే కఠిన చర్యలు తప్పవు.
: ఎస్ఐ.చిర్ర. సతీష్ 
:కమ్మరపల్లి ఎస్‌ఐ. సిహెచ్. సతీష్ 
సూర్య కమ్మర్ పల్లి :
కమ్మర్ పల్లి మండల పరిధిలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారుల పై మక్కలు (మొక్కజొన్నలు), వడ్లు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టవద్దని కమ్మర్ పల్లి ఎస్‌ఐ సతీష్  రైతులకు సూచించారు.
రోడ్లపై ధాన్యం, మక్కలు పోసి ఆరబెట్టడం వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు మరియు రైతులు, వాహనాలు అదుపుతప్పి స్కిడ్ కావడంతో, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు ప్రాణనష్టానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.రహదారులు ప్రజలు, వాహనాలు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు ఉద్దేశించినవని, వాటి పై వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతుందని  తెలిపారు.
రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్లపై కాకుండా కల్లాలు (Drying Yards), ప్లాట్ ఫార్మ్ తమ వ్యవసాయ భూములు లేదా వ్యవసాయ మార్కెట్ యార్డులలో, ఆరబెట్టుకోవాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.ప్రజలు, రైతులు మరియు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కమ్మరపల్లి మండల ప్రజలు, రైతులు సహకరించాలని కమ్మరపల్లి ఎస్‌ఐ సతీష్  కోరారు.