BREAKING
మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి: చేతి టాటూపై అభ్యంతరం.. సీబీఎఫ్‌సీ ఏ సర్టిఫికేట్ మంజూరు

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలి

Select Suryaa Now
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో  ఉంచకుండా పరిష్కరించాలి


​*దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
*కలెక్టరేట్‌లో 117 వినతుల స్వీకరణ
​వికారాబాద్ జిల్లా ప్రతినిధి , మేజర్ న్యూస్(సెప్టెంబర్ 21):
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎలాంటి పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.​జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు భూ సమస్యలు, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, గ్రామ పంచాయతీ, హౌసింగ్ తదితర అంశాలపై మొత్తం 117 వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.... స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులకు పంపి, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.​ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, డిఆర్వో స్వర్ణలత, జడ్పీ సీఈఓ సుధీర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.